: అక్బరుద్దీన్ హత్యకు కుట్ర


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హత్యకు పన్నిన కుట్రను బెంగళూరు పోలీసులు చేధించారు. 100కి పైగా కేసుల్లో నిందితుడైన గిరి అనే అతడు అక్బరుద్దీన్ ను హతమార్చేందుకు కిరాయి తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గిరి, గోవింద, మరో ముగ్గురితో కలసి అక్బరుద్దీన్ ను హతమార్చేందుకు హైదరాబాద్ కు బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు హిందూపురం మార్గంలో వెళుతున్న వారిని పట్టుకునే ప్రయత్నంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో గోవింద హతం కాగా, గిరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురూ పట్టుబడ్డారు. వారిని విచారిస్తున్నారు. భూ వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఓ రియల్టర్ అక్బరుద్దీన్ ను అంతమొందించేందుకు గిరి, గోవిందకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News