: తెలంగాణ టీడీపీ విజేతలకు అభినందన సభ: ఎల్.రమణ
తెలంగాణలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సోమవారం నాడు అభినందన సభ నిర్వహించనున్నట్లు టీడీపీ నేత ఎల్.రమణ తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ ఇవాళ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. తెలంగాణ కోసం టీడీపీ లేఖ ఇచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని ఎర్రబెల్లి అన్నారు.