: గుజరాత్ నూతన సీఎంగా ఆనందీ బెన్ పటేల్!


సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం ఈ నెల 21న గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ రోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు అధ్యక్షత వహించేందుకు కొత్త సీఎంను ఎంపిక చేయాలి. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అగ్ర నాయకత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా ఆ పార్టీ పరిశీలకులు ఇప్పటికే గుజరాత్ చేరుకున్నారు.

మోడీ మంత్రి వర్గంలో రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనందీ బెన్ పటేల్ ఎంపికపై రాష్ట్ర పరిశీలకులు అటు పార్టీ రాష్ట్ర నాయకులు, ఇటు కేంద్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఆనందీను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News