: విశాఖను అభివృద్ధి చేస్తా: హరిబాబు
విశాఖ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత హరిబాబు చెప్పారు. ఈ ఉదయం ఆర్కే బీచ్ లో వాకింగ్ కు వచ్చిన వారిని కలసి ఆయన తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించడం, ట్రాఫిక్ సమస్య నివారణకు రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టడానికి, పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.