: శ్రీవారి సేవలో రోజా, దేవగౌడ


జనతాదళ్ సెక్యులర్ అధినేత, మాజీ ప్రధాని దేవగౌడ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొన్న అనంతరం దేవగౌడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేత నరేంద్రమోడీ ప్రధానిగా ఐదేళ్ల పాటు మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్రలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ నుంచి ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారని తెలిపారు. రోజా ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమె కూడా స్వామిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News