: బీహార్ లో రాజకీయంగా సరికొత్త పరిణామాలు


ఎన్నికల్లో తీవ్ర పరాజయంతో బీహార్ ముఖ్యమంత్రి పదవికి జేడీయూ నేత నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయంగా కొత్త పరిణామాలకు అవకాశం కల్పించింది. కొత్త ముఖ్యమంత్రి ఎవరో నేడు తేలనుంది. జేడీయూ పార్టీ సమావేశం ఈ రోజు సాయంత్రం అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆధ్వర్యంలో పాట్నాలో జరగనుంది. ఇందులోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించనున్నారు. బీహార్ అసెంబ్లీకి వచ్చే ఏడాది నవంబర్ వరకు గడవు ఉంది. ప్రస్తుతం శాసనసభలో 243 స్థానాలకు గాను 6 ఖాళీలు ఉన్నాయి. జేడీయూకు 115, బీజేపీకి 89, ఆర్జేడీకి 21 మంది, కాంగ్రెస్ కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బద్ధశత్రువైన ఆర్జేడీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేడీయూ భావిస్తోంది. కాంగ్రెస్ తో కూడా చర్చలు జరపనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. గతంలో జేడీయూకు 20 ఎంపీ స్థానాలు ఉండగా, ఈ ఎన్నికల్లో మోడీ ధాటికి కేవలం రెండు స్థానాలే ఆ పార్టీకి దక్కాయి. దీంతో పార్టీలో నితీశ్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేయగా, గవర్నర్ దాన్ని ఆమోదించారు.

  • Loading...

More Telugu News