: విద్యుత్ భారాన్ని మేమే భరిస్తాం: సీఎం
విద్యుత్ ఛార్జీల నూతన టారిఫ్ తో ఈ ఏడాది ప్రజలపై పడే రూ. 830 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఓ యూనిట్ విద్యుత్ కు రూ. 5.25 ఖర్చవుతోందని సీఎం వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 2 కోట్ల 55 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, వాటిలో 2 కోట్ల 16 లక్షల కనెక్షన్లకు ఛార్జీలు పెంచలేదని చెప్పారు. వీటిలో లక్షా 75 వేల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన వివరించారు.