: రాజమండ్రిలో వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన వైకాపా (వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ) ఎమ్మెల్యేలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సమావేశం కానున్నారు. ఈ నెల 21న జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ శాసన సభాపక్ష నేతను ఎన్నుకుంటారు.