: ప్రభుత్వ బిల్లులు స్వాహా చేస్తున్న సైబర్ నేరస్తుడు అరెస్టు
నకిలీ ప్రభుత్వ వెబ్ సైట్ సృష్టించి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెల్లించాల్సిన బిల్లులను వసూలు చేస్తున్న సైబర్ నేరస్థుడ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్ని యువసాగర్ అనే వ్యక్తి ఏపీ ఆన్ లైన్ పేరిట నకిలీ వెబ్ సైట్ సృష్టించి, వివిధ ప్రభుత్వ శాఖల బిల్లులను వసూలు చేస్తున్నాడు. ప్రభుత్వ బిల్లులు స్వాహా చేస్తున్నాడని అందిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.