: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయ్!
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. దానికి తోడు వడగాల్పులతో మరింత ఇబ్బందికి గురవుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రలో సాధారణం కన్నా 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో సాధారణం కంటే 3 డిగ్రీలు, తెలంగాణలో 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఒంగోలు, నెల్లూరు, కావలి, బాపట్లలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడ, తిరుపతి, నంద్యాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.