: ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు
దేశ చరిత్రలో తొలిసారి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్క ముస్లిం కూడా ఎంపీగా ఎన్నిక కాలేదు. దేశంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రతిసారి పలువురు ముస్లిం అభ్యర్థులు పార్లమెంటులో అడుగుపెట్టేవారు. ఉత్తరప్రదేశ్ లో 35 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు 33 శాతం మంది ఉన్నారు. మరో 45 అసెంబ్లీ స్థానాల్లో 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇంకో 145 అసెంబ్లీ స్థానాల్లో వారి జనాభా 11 నుంచి 20 శాతం వరకు ఉంది.
మొత్తం 215 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు అభ్యర్థులను నిర్దేశించగలరు. అత్యధిక ముస్లిం ఓటర్లు ఉన్న సహారన్ పూర్, అమ్రోహా, శ్రావస్థి, బిజ్నోర్, ముజఫర్ నగర్, మురాదాబాద్, రామ్ పూర్ వంటి స్థానాల్లో కూడా ముస్లిమేతరులు విజయం సాధించడం విశేషం. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.