: నారా లోకేశ్ ట్విట్టర్ వ్యాఖ్యానం
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్న నేపథ్యంలో నారా లోకేశ్ ట్విట్టర్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంధన సర్ ఛార్జి వసూలు విషయమై 2009 జూన్ 26నే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుదుత్పత్తి కూడా జరగలేదని లోకేశ్ వెల్లడించారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రజలకు తెలియకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.