: బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా


బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. నిన్న (శుక్రవారం)టి లోక్ సభ ఫలితాల్లో ఆయన పార్టీ జేడీయూ దారుణంగా పరాజయం చెందడంతో... ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవినుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. అంతేగాక బీహార్ అసెంబ్లీని కూడా రద్దు చేయాలని నితీష్ సిఫార్సు చేశారు. అటు తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ కు సమర్పించనున్నారు. ఇక్కడి మొత్తం 40 లోక్ సభ స్థానాల్లో కేవలం రెండు స్థానాలనే ఆ పార్టీ గెలుచుకుంది.

  • Loading...

More Telugu News