: నవ తెలంగాణ ప్రధానాంశంగా లఘు చిత్రాల పోటీ


జూన్ 2న తెలంగాణ ఏర్పడనున్న నేపథ్యంలో, తెలంగాణ పునర్నిర్మాణాన్ని పురస్కరించుకుని 'తెలంగాణ దృశ్యం' పేరుతో నవ తెలంగాణ షార్ట్ ఫిలింస్ పేరిట పోటీ నిర్వహించనున్నారు. ఈ పోటీని తెలంగాణ నిర్మాతలు, దర్శకుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనాలకునే వారు జూన్ 15లోగా తమ ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. పోటీలో పాల్గొనే వారు 3 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉన్న షార్ట్ ఫిలింలను పోటీకి పంపాల్సి ఉంటుంది. తెలంగాణ పోరాటం, ఆకాంక్ష, జీవన విధానం, పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఇలా విషయం ఏదైనా సరే తెలంగాణకు సంబంధించినదై ఉండాలి.

విజేతలను సుప్రసిద్ధులైన దర్శక నిర్మాతలతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు... వివిధ కేటగిరీల్లో ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయి. ఈ వివరాలను తెలంగాణ సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్, తెలంగాణ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు సానా యాదిరెడ్డిలు తెలిపారు. ఎంట్రీలను telanganadrushyam@gmail.com కు ఈమెయిల్ ద్వారా పంపాలి. జూన్ మూడో వారంలో హైదరాబాదులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందజేస్తారు.

  • Loading...

More Telugu News