: హిందూపురంలో ఘనంగా బాలయ్య విజయోత్సవ ర్యాలీ
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుతల్లి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముణేసముద్రం నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. తనపై నమ్మకంతో విజయం అందించిన ప్రతిఒక్కరికీ బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.