: తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్ సింగ్, పొన్నాల కారణం: పాల్వాయి


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అసలు కారణం దిగ్విజయ్ సింగ్, పొన్నాల లక్ష్మయ్యలేనని, వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పొన్నాల లక్ష్మయ్య టికెట్లు అమ్ముకున్నారని, ఆయనను తక్షణం తప్పించాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ కేవీపీ డైరెక్షన్ లో నడిచి టీపీసీసీ ఏర్పాటు చేయడం ఆలస్యం చేశారని ఆరోపించారు.

తెలంగాణ బిల్లు రూపకల్పనలో కేసీఆర్ పాత్ర ఉండాలన్న తన సలహాను దిగ్విజయ్ పట్టించుకోలేదని పాల్వాయి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైన పొన్నాల పార్టీకి క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ వంటి వారు సోనియా చుట్టూ చేరి పార్టీని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News