: ఈ నెల 20న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: రాజ్ నాథ్ సింగ్


ఈ నెల 20న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అదే రోజున ప్రధాన అభ్యర్థిని పార్టీ లాంఛనంగా ప్రకటిస్తుందని చెప్పారు. పార్టీ గెలిచిన అనంతరం ఢిల్లీలో నిర్వహించిన తొలి పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ బోర్డు నరేంద్ర మోడీని అభినందించిందన్న ఆయన, దేశ వ్యాప్తంగా బీజేపీని గెలిపించినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత అఖండ మెజార్టీ సాధించిన కాంగ్రెసేతర పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. భారత ప్రజలు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్న రాజ్ నాథ్, మోడీ తర్వాత గుజరాత్ సీఎం ఎంపిక బాధ్యత తనకు అప్పజెప్పినట్లు వెల్లడించారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇంకా ఎలాంటి తేదీ నిర్ణయించలేదన్నారు.

  • Loading...

More Telugu News