: కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మారు: గుత్తా
తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ఆ ప్రాంత్ర నేతలు ఒప్పుకున్నారు. ఓటమికి అందరిదీ సమష్టి బాధ్యత అని కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని, అవాస్తవాలను చెప్పలేకపోయామని పేర్కొన్నారు. ఈ మేరకు జైపాల్ రెడ్డి నివాసంలో పొన్నాల, గుత్తా, మల్లు రవి భేటీ అయి కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషణ చేసుకున్నారు.