: ఢిల్లీలో నరేంద్ర మోడీ విజయోత్సవ ర్యాలీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విక్టరీ సింబల్ ను చూపుతూ ఢిల్లీ ప్రజలకు మోడీ అబివాదం చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు, అభిమానులతో ఢిల్లీ వీధులు నిండిపోయాయి. ఈ ఊరేగింపు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. ఈ సందర్భంగా మోడీకి పూలవర్షంతో బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మోడీని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.