: రాహుల్ ప్రసంగంపై పారిశ్రామిక వేత్తల ప్రశంసలు


సీఐఐ సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఉదయం చేసిన  ప్రసంగంపై పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ ఉపన్యాసంలో పేర్కొన్న ఆలోచనలు, సిద్ధాంతాలు అద్భుతంగా ఉన్నాయని  సీఐఐ అధ్యక్షుడు ఆది గోద్రెజ్ అన్నారు. దేశం ప్రగతి పథంలో నడవాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పరోక్షంగా రాహుల్ సూచించిన ఆలోచన బాగా నచ్చిందన్నారు.

దేశ ప్రగతికోసం పారిశ్రామిక రంగం ప్రభుత్వంతో కచ్చితంగా కలిసి పనిచేయాలని చెప్పారు. ఇక, రాహుల్ ప్రసంగం తనను బాగా ఆకట్టుకుందని పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ అన్నారు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో మొదటిసారే  మాట్లాడినప్పటికీ, తన ప్రసంగంలో అతి కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించిన విధానం నచ్చిందన్నారు. మరోవైపు రాహుల్ ప్రసంగాన్ని బీజేపీ నేతలు అయోమయ ఉపన్యాసంగా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News