: బాబును, బీజేపీని నమ్మారు కానీ... కాంగ్రెస్ ను నమ్మలేదు: జేడీ శీలం


వైఎస్సార్సీపీ అంతానికి టీడీపీ అంకురార్పణ చేసిందని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. 2009 నుంచే కాంగ్రెస్ వ్యతిరేకత మొదలైందని... సమస్యను గుర్తించినప్పటికీ పరిష్కరించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోలేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వాలని లెటర్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రజలు నమ్మారని... తెలంగాణ ఇచ్చేందుకు సహకరించిన బీజేపీని కూడా నమ్మారని... కానీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను మాత్రం నమ్మలేదని చెప్పారు. ఇప్పుడు ఓటమి పాలైనంత మాత్రాన బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదని... మరో ఐదేళ్లలో మళ్లీ పుంజుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News