: కాంగ్రెస్సుతో పెట్టుకుంటే అంతే మరి!


అవును...  కాంగ్రెస్ తో పెట్టుకుంటే అంతే మరి! ఆ పార్టీకి సంబంధించిన నేతల విషయాల్లో తలదూర్చితే. ఎవరైనా సరే శిక్షకు గురికావల్సిందే. ఇంతకీ కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎవరు తలదూర్చారు అనుకుంటున్నారా...  ఛండీఘర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కు!

ప్రస్తుతం ఈయన హర్యానా 'విత్తనాభివృద్ధి కార్పోరేషన్'కి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఆయన గత ఆరు నెలల నుంచి పనిచేస్తున్నారు. కానీ, అతితక్కువ కాలంలోనే మళ్లీ వేరే చోటకి బదిలీ అయ్యారు. ఎందుకనుకుంటున్నారా? ఇక అసలు విషయంలోకి వెళితే.. పోయిన ఏడాది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు, డీఎల్ఎఫ్ సంస్థ భూముల కేటాయింపుపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో రాబర్ట్ వాద్రా భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ అశోక్ ఖేమ్కు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే, ఆయనను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని హర్యానా సర్కారు బదిలీ చేసిందని సమాచారం. 21 సంవత్సరాల తన సర్వీసులో ఖేమ్కు ఇప్పటివరకు 40 సార్లు బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్ లో వాద్రా వ్యవహారంలో ఆయన విచారణ ప్రారంభించారు. ఆ వెంటనే ఆయన్ను హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న శాఖకు పంపింది.

  • Loading...

More Telugu News