: రాబోయే రోజుల్లో భారత్ సూపర్ పవర్ గా ఎదగాలి: మన్మోహన్
దేశానికి సేవ చేసే అవకాశం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ పదేళ్ల కాలంలో తాము ఎన్నో అభివృద్ధి పనులను చేశామని తెలిపారు. కాబోయే ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన... రాబోయే ప్రభుత్వానికి గొప్ప విజయాలు కలగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భారత్ సూపర్ పవర్ గా ఎదగాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పదేళ్ల యూపీఏ పాలన ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పారు.