: తిరుపతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం!
నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయడు ప్రమాణ స్వీకారాన్ని ఎక్కడ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు తన మీద నమ్మకం వుంచి, తనకు అధికారాన్ని కట్టబెట్టిన సందర్భంగా ప్రమాణ స్వీకారాన్ని సీమాంధ్ర గడ్డపైనే చేయాలన్న నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నట్టు తెలుస్తోంది.
దానికి తోడు, 'చెట్టు కింద అయినా సీమాంధ్రలోనే ప్రమాణ స్వీకారం చేస్తా'నని ఇటీవల ఎన్నికల ప్రచారంలో బాబు ఉద్వేగంగా ప్రకటించారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని తన కులదైవం వెంకటేశ్వరస్వామి పాదాల చెంత తిరుపతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
అలాగే, మరో ప్రత్యామ్నాయంగా విజయవాడను కూడా పరిశీలిస్తున్నారు.