: నేడు 15వ లోక్ సభ రద్దుకు కేబినెట్ సమావేశం
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా 15వ లోక్ సభను రద్దు చేయాల్సిందిగా కోరడానికి ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ చివరి సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. లోక్ సభ రద్దు చేయాలని కోరుతూ హోం మంత్రి షిండే తీర్మానం ప్రవేశపెడతారని అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ రాష్టపతిని మధ్యాహ్నం 1.45 గంటలకు కలుస్తారు.