: సిరియా రెబెల్స్ చేతిలో అమెరికా 'సీల్' తుపాకులు


అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడంలో ప్రధాన పాత్ర పోషించిన అమెరికా నేవీ సీల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. వారు ఉపయోగించిన ఆటోమేటిక్ ఆయుధాలు, నైట్ విజన్ గాగుల్స్, వారి ఆహార్యం అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా వారి చేతుల్లో కనిపించిన అత్యాధునిక స్నైపర్ రైఫిల్ ఏఎస్-50 ఇప్పుడు సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లో కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోన్న సిరియాలో రెబెల్స్ ఇప్పుడీ అత్యాధునిక తుపాకులు వినియోగిస్తున్నట్టు ఓ యూట్యూబ్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ ఏఎస్-50 స్నైపర్ రైఫిళ్ళను బ్రిటన్ తయారుచేస్తోంది. ఇంతకుముందు ఆఫ్గాన్ లో ఓ బ్రిటీష్ సైనికుడు ఈ తుపాకీతో సుమారు ఒకటిన్నర మైళ్ళ  దూరం నుంచి గురిచూసి ఇద్దరు తాలిబాన్లను చంపడం ఇప్పటికీ ఓ రికార్డే.

కాగా, సిరియా తిరుగుబాటుదారులకు ఈ తుపాకులు ఖతార్, సౌదీ అరేబియా, టర్కీల నుంచి అందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మూడు దేశాలు కూడా అమెరికాకు మిత్ర దేశాలు కావడం, అగ్రరాజ్యం నుంచే ఆయుధ కొనుగోళ్ళు జరపడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇదిలావుంటే ఈ ఏఎస్-50 రైఫిల్ తయారీ సంస్థ 'ఆక్యురసీ ఇంటర్నేషనల్' నేరుగా సౌదీ, టర్కీ సైన్యాలకు ఈ తుపాకులను విక్రయిస్తోంది. 

  • Loading...

More Telugu News