: దేశం కోసం మరణించే భాగ్యం దక్కలేదు...దేశం కోసం జీవించే అవకాశం కలిగింది: మోడీ
కాబోయే ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు వడోదరలో మాట్లాడుతూ, దేశం కోసం పోరాడే భాగ్యం, దేశం కోసం అమరజీవిగా నిలిచే అదృష్టం కలగలేదని, అయితే దేశం కోసం జీవించే అవకాశం కలిగిందని అన్నారు.
దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి అడుగులు వేద్దామని మోడీ పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం అంటే వీఐపీల సొత్తు కాదని, ప్రభుత్వం అంటే ప్రజల సొత్తని ఆయన భరోసా ఇచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ప్రభుత్వంలో భాగమని ఆయన అన్నారు. దేశప్రజలు తొలిసారిగా ఒక స్వతంత్ర కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారని ఆయన చెప్పారు. రాజకీయ పండితులందరి అంచనాలు తప్పయ్యాయని మోడీ తెలిపారు.