: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తా: కేసీఆర్


టీఆర్ఎస్ మేనిఫెస్టో అమలుకు కట్టుబడి ఉన్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ విజయాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నామని ఆయన చెప్పారు. తమపై ఉంచిన నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్రమోడీ, చంద్రబాబులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ క్యాడర్ అంతా సంస్కారవంతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News