: ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే ఆదాయం రూ. 10వేల కోట్లు
మార్చి 31తో ముగిసిన 2012-13 ఆర్థిక సంవత్సరానికి దక్షిణ మధ్య రైల్వే రూ. 10వేల కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇది ఓ రికార్డు! సరుకుల రవాణా ద్వారా రూ. 7,648 కోట్లు, ప్రయాణీకుల తరలింపు ద్వారా రూ. 2236 కోట్లు ఆదాయం వచ్చిందని రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాదితో పోల్చితే ఆదాయవనరుల సమీకరణలో 23 శాతం పురోగతి సాధించినట్టు ఆయన వెల్లడించారు.