: మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణ గెలుపు
మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ విజయం సాధించారు. తన ప్రత్యర్థి పార్థసారధిపై ఆయన 47 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కొనకళ్ల నారాయణకు 3,02,157 ఓట్లు పోలవ్వగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారధికి 2,57,437 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ కు కేవలం 7 వేల ఓట్లు పోలయ్యాయి. కాగా, 4,153 మంది ఓటర్లు నోటా గుర్తుపై ఓటు వేయటం గమనార్హం.