: ఓడిపోయినంత మాత్రాన కుంగిపోం: పొన్నాల
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. ఇక నుంచి ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత తెలంగాణలోనూ కనిపించిందని, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోమన్నారు. ఓటమిని విశ్లేషిస్తున్నామని పొన్నాల చెప్పారు.