: ప్రజలు తమ అసహనాన్ని రుచి చూపించారు: పవన్ కల్యాణ్
రాజశేఖర్ రెడ్డి పరిపాలనతో ప్రజలు ఎంతగా విసిగిపోయారో తమ నిర్ణయం ద్వారా తెలిపారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కట్టబెట్టి, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిపినందుకు ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు కూడా అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ పరిపాలని విధానం తనకు నచ్చిందని, అందుకే తాను వారికి మద్దతు ఇచ్చానని ఆయన అన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు పరిపాలన మీద, శాంతి భద్రతల మీద, అభివృద్ధి మీద నమ్మకం కలుగుతుందని ఆయన అన్నారు. మోడీ నాయకత్వంలో మంచి పరిపాలన వస్తుందన్న ఆశాభావం పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు. ప్రజల్ని వంచించిన కాంగ్రెస్ పార్టీ పతనమైపోయిందని, అధికారంలోకి వచ్చే ప్రతి నేతా అవినీతికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. కేసీఆర్ విద్వేషపూరిత మాటలు మానెయ్యాలని పవన్ కల్యాణ్ సూచించారు.