: బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఓటమి
అమృత్ సర్ లోక్ సభ నుంచి పోటీచేసిన బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అమరిందర్ సింగ్ విజయం సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అరుణ్ జైట్లీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో లోక్ సభకు పోటీచేసి పరాజయం పాలయ్యారు.