హైదరాబాదులోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి దానం నాగేందర్ ను మట్టి కరిపించి 18 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.