: ఆనందంతో కన్నీరు పెట్టుకున్న రోజా
సినీనటి, వైఎస్సార్సీపీ నేత రోజా ఆనందభాష్ఫాలు రాల్చారు. నగరిలో ఆమె మాట్లాడుతూ, టీడీపీలో తనను రెండు సార్లు స్వంత పార్టీ నేతలే మోసం చేశారని అన్నారు, అలాంటిది వైఎస్సార్సీపీలో నేతలతో పాటు, ప్రజలు కూడా సొంత చెల్లెలులా ఆదరించారని రోజా కన్నీరు పెట్టుకుంది. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన విజయం వెనుక తన భర్త, అన్నలు ఉన్నారని ఆమె అభిప్రాయపడింది.