: ప్రలోభాలు పెట్టినా ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారు: చంద్రబాబు


ఎన్ని రకల ప్రలోభాలు పెట్టినా ప్రజలు ధర్మంవైపు నిలబడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో ఏ నమ్మకం కల్పించామో దానిని సాధించి తీరుతామని అన్నారు. సీమాంధ్ర పునాదుల నుంచి నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారినందర్నీ కలిపి, తెలుగువారికి పూర్వవైభవం తీసుకురావడం చాలా అవసరమని, పూర్వవైభవం తెస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

తాము ఇచ్చిన ప్రతి వాగ్థానాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. తాము ఎక్కడ ఉన్నామో సమీక్షించి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఒక మంచి కోసం సహకరించిన మోడీ, పవన్ కల్యాణ్ సహా ప్రజలందరికీ ధన్యవాదాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News