: నా కుమారుడు దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాడు: మోడీ తల్లి


మోడీ దేశ ప్రధాని కావడం ఖాయమని తేలిపోయిన నేపథ్యంలో ఆయన తల్లి హీరాబెన్ మోడీ ఎంతో సంతోషంతో ఉన్నారు. తన కుమారుడు దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళతాడని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మోడీకి తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. మోడీ విజయం నేపథ్యంలో గుజరాత్ లోని గాంధీ నగర్ లో హీరాబెన్ సూర్యదేవుడికి నమస్కరించారు.

  • Loading...

More Telugu News