: కాంగ్రెస్ పరిస్థితి దీనాతిదీనం
పదేళ్ల పాటు దేశాన్ని అస్తవ్యస్తంగా పాలించిన కాంగ్రెస్ కు ఓటర్లు కర్రువాచి వాత పెట్టారు. ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ ఇప్పటి వరకు 53 స్థానాల్లోనే గెలుపు, ఆధిక్యంలో ఉంది. యూపీఏలోని మిత్ర పక్షాలను కూడా కలుపుకుంటే మొత్తం 68 స్థానాలకే పరిమితం అయ్యేట్లు కనపడుతోంది. బీజేపీ మాత్రం సొంతంగానే 275 స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో కొనసాగుతోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు 272 స్థానాలు. దీన్ని బీజేపీ సొంతంగానే చేరుకునేట్లు కనిపిస్తోంది. ఇక ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలను కూడా కలిపి చూస్తే మొత్తం 327 స్థానాల్లో గెలుపు, విజయం వరించేట్లు కనపడుతోంది.