: పలు స్థానాల్లో కాంగ్రెస్ నేతలు వెనుకంజ!


2014 సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ ను తీవ్ర నిరాశ పరుస్తున్నాయి. పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, పలు అంశాలతో యూపీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు అంతగా చేరువకాలేకపోయింది. దాంతో, ప్రస్తుత ఫలితాల్లో దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శాసనసభ, లోక్ సభ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ప్రధానంగా కేంద్రం నుంచి ప్రధాన నేతలు సల్మాన్ ఖుర్షీద్, శశి థరూర్, కాశ్మీర్ నుంచి గులాం నబీ ఆజాద్ తదితరులు ఓటమి బాటలో నడుస్తున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గాలికి హస్తం చతికిలబడిపోతోంది.

  • Loading...

More Telugu News