: షిర్డీ సాయి బంగారం దారిమళ్లుతోందా....!
భారతదేశంలోని అత్యధిక ఆదాయం వస్తోన్న దేవస్థానాలలో తిరుమల శ్రీవారి తర్వాతి స్థానం షిర్డీ సాయినాధునిదే. విశ్వవ్యాప్తంగా భక్తజనంలో ఇంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న షిర్డీ సాయి సంపద దారిమళ్లుతోందా.. అంటే, అవుననే సమాధానం ఇస్తున్నారు ఆర్ టీ ఐ కార్యకర్త సంజయ్ కాలే.
భక్తులిచ్చే బంగారాన్ని కరిగించి, సాయి ముద్రికలుగా తయారు చేస్తోన్న క్రమంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. ముద్రికల తయారీకి 2008 నుంచి 2012 వరకూ కొన్ని వందల కిలోల సాయి బంగారాన్ని ముంబైకి తరలించారని, అయితే, తిరిగి వచ్చే బంగారం తక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. సాయి సంస్థాన్ ట్రస్ట్ నిబంధనలు పాటించటంలేదని సంజయ్ కాలే విమర్శిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.