: వచ్చేస్తోంది.. వండర్ కార్!


పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా వాహనదారుల ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలియందికాదు. ఒకటి రెండు రోజులు సణుక్కుంటూనే బండి లాగించేస్తారు, మూడో రోజు నుంచి అలవాటు పడిపోతారు. వర్ధమాన దేశాల్లో చమురు ధరల పెంపు చూపే ప్రభావం ఇలాగే ఉంటుంది. అయితే, తాము రూపొందించే కారు ఈ కష్టాలన్నింటికి చెక్ పెడుతుందంటున్నారు యూఏఈ విద్యార్థులు.

వారు తయారు చేస్తున్న కారు లీటర్ ఇంధనంతో 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. అబ్బ.. ఎంత శుభవార్తో కదూ. ఇంతకీ ఈ వాహనం పేరు ఎకో-దుబాయ్-1. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. మరో రెండు వారాల్లో ప్రయోగాల కోసం రోడ్డెక్కనుందట. గత రెండేళ్ళుగా ఈ కారు తయారీలో అహోరాత్రాలు శ్రమిస్తోన్న యూఏఈ ఇంజినీరింగ్ స్టూడెంట్లు తమ వండర్ కారుతో జులైలో కౌలాలంపూర్ లో జరిగే 'షెల్ ఎకో మారథాన్' పోటీలో పాల్గొంటున్నారు.

ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా రూపొందిన ఇలాంటి కాన్సెప్ట్ కార్లు తమ సత్తా ప్రదర్శించనున్నాయి. ఈ పోటీలో, ఒక్క లీటర్ ఇంధనంతో కార్లు ఎంత దూరం ప్రయాణిస్తాయన్నది పరీక్షిస్తారట.  ఈ కార్లలో ఎలక్ట్రిక్ శక్తి, సోలార్ పవర్, హైబ్రిడ్ బ్యాటరీ వంటివి ఇంధనంగా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News