: 1100 ఓట్ల ఆధిక్యంలో గంటా,విశాఖ లో వాసుపల్లి గణేష్ ఆధిక్యం
విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయన సమీప ప్రత్యర్థిపై 1100 ఓట్ల ఆధిక్యం సాధించారు. విశాఖ దక్షిణంలో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ ఆధిక్యంలో ఉన్నారు.