: జగన్ పార్టీ భావదారిద్ర్యానికిదే తార్కాణం : ముద్దు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటో వాడుకున్నారంటూ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ఫ్లెక్సీల్లో జగన్ ఫొటో ఉంటే ఓట్లు రాలవనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని పబ్బంగడుపుకోవాలని చూస్తున్నారని ఆయన వైఎస్ఆర్ సీపీని విమర్శించారు. ఎన్టీఆర్ కు, వైఎస్ కు ఎలాంటి పోలికా లేదని ఆయన హైదరాబాద్ లో వెల్లడించారు.  

కాగా, వైఎస్ షర్మిల కృష్ణాజిల్లా పాదయాత్ర సందర్భంగా పెడనలో వైఎస్ఆర్ సీపీ నేతలు ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి,  షర్మిల ఫొటోలతో పాటు దివంగత ఎన్టీఆర్ ఫొటోను కూడా అందులో చేర్చడం ప్రస్తుత ముద్దు మాటలకు కారణం. 

  • Loading...

More Telugu News