: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రారంభం
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలవుతోంది. అధ్యక్షుడి ఎంపిక విషయమై జాతీయ స్థాయి నేతలు సతీష్ జీ, పురుషోత్తం రాష్ట్రానికి ఈ రోజు వస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అనంతరం అభ్యర్ధుల ప్రతిపాదనలను జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ముందు ఉంచుతారు.
ప్రస్తుతం అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి వున్నారు. తిరిగి ఆయననే ఎంపిక చేస్తారా? లేక కొత్తవారిని తెరముందుకు తీసుకువస్తారా? అన్నది వేచి చూడాలి.మరోసారి బాధ్యతల స్వీకరణకు కిషన్ అయిష్టంగా వున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయం త్వరలోనే తేలిపోనుంది. వాస్తవానికి డిసెంబర్లోనే పూర్తి కావాల్సిన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కారణంగా ఆలస్యం అయింది.