: కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్


సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో (8.00 గంటలకు) ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఇదే సమయంలో కౌంటింగ్ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ, 175 శాసనసభ... తెలంగాణలో 17 లోక్ సభ, 119 శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకల్లా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. అయితే, తొలి ఫలితం ఉదయం 10.30 గంటలకల్లా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మల్కాజ్ గిరి లోక్ సభ, కూకట్ పల్లి అసెంబ్లీలకు 45 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. అత్యల్పంగా చార్మినార్ అసెంబ్లీ (13 రౌండ్లు), అనకాపల్లి లోక్ సభ (18 రౌండ్లు) కౌంటింగ్ జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు.

  • Loading...

More Telugu News