: ఓటేసిన మహాశయులకు బోలెడు బహుమతులు వచ్చాయ్!
మెదక్ జిల్లాలో ఓటేసిన వారికి బోలెడు బహుమతులు... అంటూ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఓటరు పండుగను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'ఓటరు పండుగ' బంపర్ డ్రా తీసి విజేతలను కలెక్టర్ ఇవాళ ప్రకటించారు. 95 శాతం పోలింగ్ అయిన గ్రామాల్లో ఓటర్లకు ఆకర్షణీయమైన బహుమతులను కలెక్టర్ ప్రకటించారు. డ్రాలో చిన్నకోడూరు మండలం మాదిండ్ల వాసి లచ్చమ్మ నానో కారును గెలుచుకున్నారు. కారుతో పాటు మరో 10 ఎలక్ట్రానిక్ పరికరాలను గెలుచుకున్న ఓటర్ల పేర్లను కలెక్టర్ వెల్లడించారు. విజేతలకు కలెక్టర్ స్మితా సబర్వాల్ శనివారం నాడు బహుమతులను అందజేయనున్నారు.