: పేగు బంధాన్ని మరచి ఇద్దరు పిల్లలకు నిప్పుపెట్టిన తల్లి
కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల నిండు ప్రాణాల్ని బలితీసుకున్నాయి. కని పెంచిన తల్లే ఆ ఇద్దరు చిన్నారుల పాలిట మృత్యువుగా మారింది. పేగు బంధాన్ని మరచిన ఆ తల్లి అత్తమీద కోపం దుత్త మీద చూపినట్టు...భర్త మీది కోపం పిల్లలపై చూపించింది. బీహార్ లోని బాత్ గావన్ గ్రామంలో సులేఖా దేవీకి ఆయోధ్య సింగ్ తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లినాటి నుంచి నేటి వరకు వీరి మధ్య సఖ్యత కుదరలేదు.
తరచూ గొడవలు పడుతూ కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. ఎప్పట్లానే భార్యాభర్తల మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. భర్తను ఏమీ చేయలేని ఈ ఇల్లాలు అతనిపై కోపాన్ని పిల్లలైన కాజల్ కుమారి(4), కృష్ణ కుమార్(2) లపై చూపించింది. చిన్నారులిద్దరూ నిద్దురపోతున్న సమయంలో వారిపై కిరోసిన్ పోసి నిప్పటించింది. తీవ్రగాయాలపాలైన చిన్నారులిద్దరూ మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.