: జూన్ రెండో వారంలో రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు
జూన్ రెండో వారంలో మన రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. మరో 48 గంటల్లో రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపఖండంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి ప్రస్తుతం అనుకూల వాతావరణం నెలకొందని వెల్లడించింది. ఈ నెలాఖరుకు రుతుపవనాలు కేరళ తీరం దాటే అవకాశాలున్నాయి.