: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయ్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడి ధాటికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో సాధారణం కన్నా 8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, తెలంగాణలో 2 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంగోలు, రెంటచింతలలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.