: ఆ లక్షణం గుండెకు ఎంతో చేటు
జరిగేది జరగక మానదు.. జరగనిది ఎన్నటికీ జరుగదు అని ఓ సినీ కవి చెప్పినట్టు తాపీగా ఉంటే పదికాలాలపాటు ప్రశాంతంగా బతుకుతామని పరిశోధనలు చెబుతున్నాయి. లేనిపోని విషయాలపై ఆందోళన, ఆదుర్దా పడితే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువట. ఈ సూత్రం ఒక్క చెడు అంశాలపైనే కాదు, సానుకూల అంశాలపై కూడా ప్రభావం చూపిస్తుందట. దీనివల్ల గుండెకు చేటు జరుగుతుందని ఓ సర్వే తెలిపింది. అతిగా ఆలోచించే వారి గుండె, మెదడులో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
కార్డియాక్ రీహాబిలిటేషన్ క్యాంపులో 60 ఏళ్లు పైబడి పది సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వెయ్యి మంది రోగులపై శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ప్రతివిషయంపై అతిగా ఆలోచించడం, గాభరా పడడం కారణంగా వీరి గుండె బలహీనంగా మారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా బలహీనంగా మారిన గుండెకు రెండు సార్లు నొప్పి వస్తే అది గుండె పోటుకు దారి తీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. నాలుగు సార్లు గుండెనొప్పి వస్తే మరణం సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.